పాము కాటు చెప్పినా పట్టించుకోలేదు.. చికిత్స పొందుతూ 4 ఏళ్ల బాలుడు మృతి

కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీరంగ పట్టణం తాలూకా, బాబురాయనకొప్పలు గ్రామంలో నాలుగేళ్ల పవిష్‌ (Pavish) అనే బాలుడు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే.. పవిష్‌ను పాము కరిచిన వెంటనే అతను తన తల్లికి తెలిపాడు. అయితే చిన్న పిల్లవాడు అలా ఊరికే చెబుతున్నాడని భావించిన తల్లి అతని మాటలను పట్టించుకోలేదు. అయితే, అర్ధగంట తర్వాత బాలుడు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పవిష్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. పిల్లల ఆరోగ్యంపై చిన్న విషయంలోనైనా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read More : వల్లభనేని వంశీ రిమాండ్ (Remand) పొడిగింపు