అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై 50 శాతం భారీ సుంకాలు విధించినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం మాస్కో ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బతీసిందని ఆయన అన్నారు. వైట్‌హౌస్‌లో సోమవారం మాట్లాడిన ట్రంప్, “రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే రెండో అతిపెద్ద భాగస్వామి భారత్. దీనిపై 50 శాతం సుంకం విధించాం. ఇది రష్యాకు గట్టి ఎదురుదెబ్బ” అని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకానికి అదనంగా మరో 25 శాతం విధించడం వల్ల మొత్తం సుంకం 50 శాతానికి చేరిందని వివరించారు.
ఈ సుంకాల విధానం అమెరికాకు ఆదాయం తెచ్చిపెట్టడమే కాకుండా, శత్రు దేశాలపై బలమైన అధికారం ఇచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. “ఈ విధానంతోనే ఐదు పెద్ద యుద్ధాలను పరిష్కరించాం. అందులో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కూడా ఉంది” అని తెలిపారు. అజర్‌బైజాన్–అర్మేనియా మధ్య 37 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని కూడా తమ ప్రభుత్వం పరిష్కరించిందని ట్రంప్ హైలైట్ చేశారు. “రష్యా సహా అనేక దేశాలు ప్రయత్నించినా విఫలమయ్యాయి. కానీ మేం సాధించాం” అని ఆయన అన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో త్వరలో భేటీ కానున్నట్లు తెలిపిన ట్రంప్, ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందంపై చర్చిస్తానని తెలిపారు. “పుతిన్‌తో సమావేశం మొదలైన రెండో నిమిషంలోనే ఒప్పందం కుదురుతుందో లేదో నేను చెప్పగలను” అని ధీమా వ్యక్తం చేశారు. రష్యా యుద్ధాన్ని మానుకుని వ్యాపారంపై దృష్టి పెడితే సాధారణ వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
Read More : గాజాలో ఇజ్రాయెల్ దాడి… అల్ జజీరా జర్నలిస్టులు మృతి

2 thoughts on “భారత్‌పై 50% సుంకం: ట్రంప్ వ్యాఖ్యలు”
Comments are closed.