నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వినూత్న కార్యక్రమంతో అందరినీ ఆకట్టుకున్నారు. పట్టణంలోని పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చే లక్ష్యంతో శనివారం ఉదయం ఆయన స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడిగా మారి పని ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీనగర్ వరకు చెత్త సేకరణ వాహనాన్ని స్వయంగా నడుపుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి చెత్తను స్వయంగా సేకరించారు. ప్రజలకు పరిశుభ్రత అవసరాన్ని వివరించారు. ముందుగా, ఆయన అక్కడికక్కడే పారిశుధ్య కార్మికుల పనితీరును పరిశీలించి, వారి ప్రయత్నాలను సమీక్షించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మిర్యాలగూడ పట్టణాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని సూచించారు. పరిశుభ్రతపై అందరూ అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Read More : కూర్మ గ్రామ అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన
