ఆపదలో ఉన్న గల్ఫ్ కార్మికుడికి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సాయం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన చొప్పరి లింగయ్య తీవ్ర అనారోగ్యానికి గురై, సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశాడు.
లింగయ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి పొన్నం వెంటనే స్పందించి, ఫ్లైట్ టికెట్ స్వయంగా కొనుగోలు చేసి పంపించారు. లింగయ్యను స్వదేశానికి రప్పించేందుకు సంబంధిత అధికారులతో చురుగ్గా చర్చలు జరిపారు.
గల్ఫ్ ఎన్నారై సంఘాల సహకారంతో, అక్కడి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి లింగయ్య పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంటేషన్ పనులను పూర్తిచేసి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సమన్వయంతో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.
తాను సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నానని చెబుతూ, లింగయ్య మరియు ఆయన కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

One thought on “స్వదేశానికి గల్ఫ్ కార్మికుడిని తీసుకొచ్చిన మంత్రి పొన్నం”
Comments are closed.