భర్తను దారుణంగా హత్య చేసిన ముస్కాన్.. ప్రియుడితో కలిసి సంబరాలు! వీడియోలు వైరల్

మీరట్‌కి చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అతని భార్య ముస్కాన్ దారుణ హత్యకు పాల్పడి, ప్రియుడితో కలిసి సంబరాలు చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

హత్య తర్వాత హోలీ సంబరాలు, బర్త్‌డే పార్టీ..

సౌరభ్‌ను హత్య చేసిన తర్వాత ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా హోలీ వేడుకలు జరుపుకున్నారు. అంతేకాకుండా, బర్త్‌డే పార్టీ కూడా నిర్వహించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ముస్కాన్.. సాహిల్‌కు కేకు తినిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కెమెరా ముందు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఈ జంట ఆ తర్వాత మనాలి వెళ్లి హాలిడే ఎంజాయ్ చేసింది. మంచులో దిగిన ఫొటోలు సైతం వైరల్‌గా మారాయి.

భర్తను మూడు సార్లు కత్తితో పొడిచి హత్య..

పోలీసుల దర్యాప్తులో ముస్కాన్ క్రూరత్వం బయటపడింది. నిద్ర మాత్రలు కలిపిన భోజనం ఇచ్చి, భర్తను మోసగించి హత్య చేసింది. సౌరభ్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత కత్తితో గుండెల్లో మూడు సార్లు పొడిచింది. హత్య తర్వాత అతని తలను మొండెం నుంచి వేరు చేసి, మిగిలిన శరీరాన్ని 15 ముక్కలుగా నరికింది. అనంతరం శవాన్ని డ్రమ్‌లో వేసి, సిమెంట్‌తో కప్పేసింది.

పోలీసులకు ముస్కాన్ చేతికి చిక్కిన విధానం

సౌరభ్‌ను చంపిన తర్వాత అతని మొబైల్‌ను ఉపయోగిస్తూ ముస్కాన్, సాహిల్‌లు అనుమానాలు రాకుండా ప్రయత్నించారు. అతని చెల్లెలికి వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపారు. అనంతరం సెల్‌ఫోన్‌ను తీసుకుని మనాలి వెళ్లి అక్కడి నుంచి ఫోటోలు అప్‌లోడ్ చేశారు. అయితే, సౌరభ్ తల్లిదండ్రులు ఫోన్ చేసినపుడు ముస్కాన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం పెరిగింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేయగా, షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. చివరకు ముస్కాన్, సాహిల్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

కేసు వివరాలు వెలుగుచూస్తుండగా..

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్తను హత్య చేసిన తర్వాత హాయిగా హోలీ సంబరాలు చేసుకున్న ముస్కాన్ ప్రవర్తనపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లకు కూడా ముస్కాన్ చేసిన క్రూరమైన హత్య వివరాలు షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.

Read More : కాలుష్య నియంత్రణకు భారీ చర్యలు

One thought on “భర్తను దారుణంగా హత్య చేసిన ముస్కాన్.. ప్రియుడితో కలిసి సంబరాలు! వీడియోలు వైరల్

Comments are closed.