టాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి కెరీర్ ఒక్కసారిగా స్లో అయినట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. లక్కీ భాస్కర్
, సంక్రాంతికి వస్తున్నాం
వంటి హిట్స్ ఉన్నా, 2025లో ఒక్క సినిమా అవకాశం కూడా దక్కకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న అనగనగా ఒక రోజు
చిత్రంపై కూడా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో మీనాక్షి పేరు వినిపించకపోవడం గాసిప్స్‌కు కారణమైంది.
అయితే, ఇదే సమయంలో మీనాక్షికి ఊహించని బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‌లో జాన్ అబ్రహాం హీరోగా తెరకెక్కుతున్న ఫోర్స్ 3
లో హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేశారు. కథ నచ్చడంతో మీనాక్షి వెంటనే అంగీకరించడంతో ఈ అవకాశంపై ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇప్పటివరకు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా లాంచ్ కాలేని ఆమెకు ఇది కెరీర్‌లో కీలక మలుపు కానుంది.
మీనాక్షి ఇప్పటికే హిందీ సినిమాల్లో చిన్న పాత్రలు చేసినా, వాటితో పెద్ద గుర్తింపు రాలేదు. అయితే ఇచట వాహనములు నిలుపరాదు
చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ సినిమా రిలీజ్‌కు ముందే దర్శకుడు త్రివిక్రమ్ ఆమె ప్రతిభను గుర్తించి, భవిష్యత్తులో పెద్ద నటి అవుతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌లో లభించిన ఈ పెద్ద అవకాశం ఆమె కెరీర్‌ను కొత్త దిశలోకి తీసుకెళ్తుందన్న నమ్మకం ఉంది.
Read More : అల్లు అరవింద్‌కు ప్రధాని మోదీ సంతాపం
One thought on “బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ దక్కించుకున్న మీనాక్షి చౌదరి.”
Comments are closed.