మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంకట్రావ్‌పేట గేటు వద్ద వేగంగా వెళ్తున్న ఆల్టో కారు, ఎదురుగా వచ్చిన మరో కారుతో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను ఎండీ గౌస్, అలీ, అజీమ్ బేగ్‌లుగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Read More : హైదరాబాద్‌లో 3 రోజుల పాటు వైన్ షాపుల బంద్
