టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. భరత్ తల్లి కమలాసిని ఆదివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మృతి చెందినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
తల్లి మృతితో భరత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు భరత్‌కు ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు భరత్ నివాసానికి వెళ్లి కమలాసినికి చివరి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థిస్తున్నారు.

Read More : నిధి అగర్వాల్ సూపర్ కంబ్యాక్

One thought on “టాలీవుడ్ యంగ్ హీరో మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం…”
Comments are closed.