ఎలూరుజిల్లా మారేడుమిల్లి మండలంలోని అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య శనివారం ఉదయం తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు తీవ్ర నష్టం జరిగింది.
కాల్పుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్‌తో పాటు, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరూ మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకస్థాయిలో ఉన్నవారిగా గుర్తించబడినట్టు సమాచారం.
ఇంకా కొంతమంది మావోయిస్టులు అడవిలో తలదాచుకుని ఉన్నట్టు సమాచారంతో, గ్రేహౌండ్స్ బలగాలు మారేడుమిల్లి అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ చేపట్టాయి. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఈ ఎన్‌కౌంటర్‌తో ఎలూరు జిల్లాలో మావోయిస్టు కదలికలపై భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండగా, పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
Read More : ఏపీ లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి అరెస్టు

One thought on “మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్”
Comments are closed.