మద్యం మత్తులో పూజలు చేసిన అర్చకుడు తొలగింపు

మణుగూరులోని నీలకంటేశ్వర ఆలయంలో అర్చకుడి నిర్లక్ష్యం భక్తుల్లో ఆగ్రహాన్ని రేపింది. మద్యం మత్తులో ఆలయ పూజలు నిర్వహిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గర్భగుడిలో మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు గుర్తించారు. భక్తుల భావాలను దెబ్బతీసే ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు అర్చకుడిని తక్షణమే విధుల నుండి తొలగించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Read More : 2008 మలేగావ్ బాంబు పేలుడు కేసు