ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ‘ఛావా’

Chaava OTT Release

ఇటీవల విడుదలైన బాలీవుడ్ సినిమా ఛావా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విక్కీ కౌశల్ కెరీర్‌లో మరో గొప్ప సినిమాగా నిలిచింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ పోరాట పటిమను అద్భుతంగా చూపించగా, ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్నా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేయగా, ఇక్కడా మంచి ఆదరణ లభించింది.

థియేట్రికల్ విడుదల అనంతరం ఈ సినిమా పైరసీకి గురైనప్పటికీ, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఛావా సిద్ధమవుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు పాఠశాలల్లో విద్యార్థులకు ప్రదర్శించారు. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలో కూడా ట్రెండ్ అవుతుందా? అన్నది చూడాలి. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉట్టేకర్ దర్శకత్వం వహించగా, సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్ అందించారు.

Read More


One thought on “ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ‘ఛావా’

Comments are closed.