మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో నటిస్తోంది. మాస్టర్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మాళవిక, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
హౌటర్ ఫ్లై ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక, దక్షిణాది సినిమాల్లో నాభి మరియు నడుము అందాలపై ఎక్కువ ఫోకస్ పెడతారని వెల్లడించింది. “సౌత్‌లో హీరోయిన్స్ బాడీ షేప్‌కి పెద్ద ప్రాధాన్యం ఇస్తారు. నేను ముంబైలో పెరిగాను కాబట్టి, మొదట ఇది చూసి షాక్ అయ్యా,” అంటూ ఆమె తన అనుభవాన్ని షేర్ చేసింది.
మళ్లీ సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటోలను జూమ్ చేసి చూడటంపై కూడా మాళవిక స్పందించింది. కెరీర్ ఆరంభంలో సన్నగా ఉండటంపై తీవ్రంగా ట్రోల్ చేసిన విషయాలను గుర్తుచేసుకుంటూ, “ఎముకల గూడు” అంటూ అవమానించిన దశలను ఆమె వివరించింది.
చిన్న వయసులో బాడీపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ఒక రకమైన మానసిక బెదిరింపే అని మాళవిక పేర్కొంది. ఆమె మాట్లాడుతూ, “అలాంటి అనుభవాలు నాకు చాలా బాధను ఇచ్చాయి,” అంటూ తన ఆవేదనను బయటపెట్టింది.

One thought on “కెరీర్ ఆరంభంలో ఎదురైన ట్రోల్స్ పై మాళవిక ఆవేదన”
Comments are closed.