చిరంజీవి ‘విశ్వంభర’ – హాలీవుడ్ స్థాయిలో విజువల్ వండర్!

Chiranjeevi Viswambhara VFX

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “విశ్వంభర” మూవీ ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. మొదట సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, జూలై 24న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇదే తేదీన చిరు బ్లాక్‌బస్టర్ “ఇంద్ర” విడుదలైన నేపథ్యం ఉండటంతో, ఆ సెంటిమెంట్‌ని కాపాడాలని చూస్తున్నారు.

చిరంజీవి సోషియో-ఫాంటసీ సినిమాలో నటిస్తున్నందుకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, విడుదలైన గ్లింప్స్‌లోని వీఎఫ్‌ఎక్స్ వర్క్ పలువురి విమర్శలను ఎదుర్కొంది. దీనితో మేకర్స్ నష్టనివారణ చర్యలు చేపట్టి, వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ పనులకు ఏకంగా రూ.75 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం.

విశ్వంభరను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ విజువల్స్ వండర్‌గా నిలపాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ సహాయాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. అభిమానులు సినిమాని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన విశ్వంభరకి, మ్యూజిక్ మేజిషియన్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. చిరు మ్యాజిక్ మళ్లీ ఎలా గర్జిస్తుందో చూడాలి.

Read More


One thought on “చిరంజీవి ‘విశ్వంభర’ – హాలీవుడ్ స్థాయిలో విజువల్ వండర్!

Comments are closed.