ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుల్లో పడ్డారు. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మోసానికి సంబంధించి దాఖలైన ఫిర్యాదులో మహేశ్ బాబు పేరు మూడో ప్రతివాదిగా చేర్చారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా వైద్యురాలు, మరో వ్యక్తి కలిసి ‘మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్’ అనే సంస్థపై ఫిర్యాదు చేశారు. బాలాపూర్ గ్రామంలో ప్లాట్ కొనుగోలు కోసం సంస్థకు మొత్తం రూ.34.80 లక్షలు చెల్లించామని వారు పేర్కొన్నారు. ఈ సంస్థకు ప్రచారకర్తగా మహేశ్ బాబు పనిచేశారని, ఆయన చిత్రంతో రూపొందించిన బ్రోచర్‌లో ఉన్న ఆకర్షణీయ హామీలను నమ్మినట్టుగా బాధితులు తెలిపారు. అన్ని అనుమతులు ఉన్నాయని సంస్థ చెప్పిన మాటలను నమ్మి డబ్బు చెల్లించామని చెప్పారు. అయితే, అక్కడ ఎటువంటి లేఅవుట్ లేదని చివరికి తెలుసుకుని తాము మోసపోయామని వివరించారు.
తమ డబ్బు తిరిగి కోరగా, సంస్థ యజమాని కంచర్ల సతీశ్ చంద్రగుప్తా వాయిదాలుగా కేవలం రూ.15 లక్షలు మాత్రమే చెల్లించినట్లు పేర్కొన్నారు. మిగతా మొత్తాన్ని ఇవ్వలేదని, పలుమార్లు అడిగినప్పటికీ స్పందించకపోవడంతో వారు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ఈ వ్యవహారంలో సంస్థ, యజమాని, మహేశ్ బాబును కమిషన్ ప్రతివాదులుగా గుర్తించింది. దీనిపై విచారణకు సోమవారం హాజరుకావాలని ముగ్గురికీ నోటీసులు జారీ చేసింది.
Read More : ఫిష్ వెంకట్‌కు ప్రభాస్ సాయం చేసినట్లు ప్రచారం అవాస్తవం
One thought on “రియల్ ఎస్టేట్ వివాదంలో మహేశ్ బాబు పేరు”
Comments are closed.