సైఫుల్లా సాజిద్ జుట్ పాకిస్థాన్ నుంచి సూత్రధారి ఆ..?

పహల్గామ్ ఉగ్రదాడి‌కు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జుట్ సూత్రధారి గా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సైఫుల్లాను గతంలోనే తీవ్రవాదిగా గుర్తించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్ఐ) మరియు ఆర్మీ ఉన్నతాధికారులతో సైఫుల్లాకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఇస్లామాబాద్‌లోని లష్కరే స్థావరం నుంచి పనిచేస్తున్నట్లు సమాచారం.

పహల్గామ్ దాడి వ్యవహారంపై అధికార వర్గాల కథనం ప్రకారం, సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన ఉగ్రవాదులు ప్రారంభంగా పర్యాటకుల గుర్తింపు కార్డులు అడిగి వారిని గుర్తించేందుకు ప్రయత్నించారు. ముస్లిములు మరియు ముస్లిమేతరులను వేరు చేసి, ఆపై పురుషులపై 5 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దర్యాప్తు అధికారులు ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్ బుల్లెట్లు మరియు కవచాలను ఛేదించగల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది.

Read More : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి

2 thoughts on “సైఫుల్లా సాజిద్ జుట్ పాకిస్థాన్ నుంచి సూత్రధారి ఆ..?

Comments are closed.