లండన్ టెస్టులో వర్షం అంతరాయం: భారత్ 72/2

లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. దాంతో అంపైర్లు ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు.

భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14 పరుగులకే పెవిలియన్ చేరగా, జట్టు స్కోరు 38 వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో సాయి సుదర్శన్ (25 బ్యాటింగ్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (15 బ్యాటింగ్) జోడీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ ఆట్కిన్సన్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ తీసి భారత్‌కు ఎదురుదెబ్బ ఇచ్చారు.

మ్యాచ్ పరిస్థితులు పూర్తిగా వాతావరణంపై ఆధారపడి ఉండటంతో, వర్షం తగ్గితేనే ఆట మళ్లీ ప్రారంభం కానుంది.

One thought on “లండన్ టెస్టులో వర్షం అంతరాయం: భారత్ 72/2

Comments are closed.