అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మాణంలో ఉన్న తన నివాసాన్ని మంత్రి నారా లోకేశ్ స్వయంగా పరిశీలించారు. శుక్రవారం (ఆగస్టు 1) ఉదయం అమరావతికి వెళ్లిన లోకేశ్, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు.
నిర్మాణ నాణ్యత, పనుల వేగం, సౌకర్యాల అమలు వంటి అంశాలపై అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించారు. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత గడువులోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడంలో సీఎం నివాసం కూడా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమని లోకేశ్ పేర్కొన్నారు.
ఈ సందర్శన సందర్భంగా లోకేశ్, నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఇంజనీర్లతో చర్చించగా, అవసరమైన మార్పులు ఉంటే తక్షణమే చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా అమరావతి నిర్మాణం వేగవంతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Read More : విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊరట
