బల్లి తోక నుండి మంటలు..

కాంబోడియాలో ఓ ఇంటి గోడపై కనిపించిన బల్లి అబ్బురపరిచే రీతిలో వార్తల్లోకి ఎక్కింది. గోడపై ఉన్న బల్లి తన తోకను కదిపిన క్షణమే అక్కడి నుండి ఎలక్ట్రిక్ స్పార్క్‌లాంటి మంటలు వెలువడ్డాయి. ఈ అరుదైన దృశ్యం ఇంట్లో ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వేగంగా వైరల్ అయ్యింది.

ఈ దృశ్యం చూసిన నెటిజన్లు శబ్దంలేని పేలుడులా ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగానే బల్లి వల్ల జరిగిందా లేదా అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్ల ప్రభావమా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More : ఐదు వారాల తరువాత గాల్లోకి లేచిన F-35

One thought on “బల్లి తోక నుండి మంటలు..

Comments are closed.