కారు జనంపై దూసుకెళ్లి 50 మందికి గాయాలు

ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ నగరంలో సోమవారం ప్రీమియర్ లీగ్ టైటిల్ విజయోత్సవ వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ జనసందోహం మధ్య ఒక కారు వేగంగా జనంపైకి దూసుకెళ్లడంతో నలుగురు చిన్నారులు సహా సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన స్థానిక ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగించింది.

ప్రీమియర్ లీగ్ టైటిల్ విజయాన్ని స్మరించుకునేందుకు లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ నిర్వహించిన విజయోత్సవ పరేడ్‌కు వర్షం ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఆ సమయంలో ఒక్క కారు ప్రమాదకరంగా జనసమూహంలోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిలో 27 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక చిన్నారి, ఒక వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మరో 20 మంది స్వల్ప గాయాలతో ప్రాథమిక చికిత్స పొందారు. మరికొందరు స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందారు.

ఈ ఘటనకు సంబంధించిన కేసులో స్థానికంగా 53 ఏళ్ల శ్వేతజాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణించనప్పటికీ, కారు ఎలా పరేడ్ మార్గంలోకి ప్రవేశించిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రహదారులు ఈ వేడుకల కారణంగా మూసివేయబడ్డప్పటికీ ఈ ఘటన జరిగటం ప్రశ్నార్థకం అని అధికారులు చెప్పారు.

Read More : టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

One thought on “కారు జనంపై దూసుకెళ్లి 50 మందికి గాయాలు

Comments are closed.