హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, సంగీత్ నగర్‌ను కలవరపరిచిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదో తరగతి చదువుతున్న ఒక బాలుడే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లిన బాలుడు, ఆ సమయంలో సహస్ర ఒక్కతే ఉండటంతో ఆమెను దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులో ఉండి విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సహస్ర శరీరంపై దాదాపు 20 కత్తి గాయాలు ఉన్నాయని, అందులో 10 గాయాలు మెడపై ఉన్నాయని చెప్పారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం హత్య సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల మధ్య జరిగిందని నిర్ధారించారు. ఆ సమయంలో బాలిక కేకలు వినిపించాయని, పక్క భవనంలో నివసిస్తున్న వారు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, నిందితుడు పక్క భవనం నుంచి వీరి ఇంట్లోకి ప్రవేశించాడు. డబ్బు దొంగిలించే ప్రయత్నం చేస్తుండగా సహస్ర గమనించడంతో, తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించింది. దీంతో భయపడ్డ బాలుడు కత్తితో వరుసగా పొడిచి ఆమెను హత్య చేశాడు. అనంతరం సమీప భవనంలోకి వెళ్లి దాదాపు 15 నిమిషాలు దాక్కున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
దీంతో ఎస్‌ఓటీ బృందం ఆ బాలుడు చదువుతున్న పాఠశాలకు చేరుకుని విచారణ జరిపి నిజాన్ని వెలికితీసింది.
Read More : ప్రతి ఏడాది టీచర్ పోస్టుల కోసం డీఎస్సీ నిర్వహణ: మంత్రి

One thought on “కూకట్‌పల్లి సహస్ర హత్య మిస్టరీ ఛేదన.”
Comments are closed.