తమిళనాట సూపర్ హిట్ అవుతున్న సినిమాలు తెలుగులో మాత్రం కనీసంగా ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల సినిమాలు టాలీవుడ్‌లో కూడా పెద్ద హైప్‌తో రిలీజ్ అవుతున్నా, ఫలితం నిరాశాజనకంగా మారుతోంది.
గత నెల అజిత్ సినిమా పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. తమిళంలో “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చినా, తెలుగులో మాత్రం ఆ జోరు కనబడలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదన్న స్థాయికి పరిమితమైంది.
ఇప్పుడు సూర్య “రెట్రో” మూవీకి కూడా అదే పరిస్థితే. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాపై తెలుగులో భారీ అంచనాలు ఉండగా, రెండో రోజుకే కలెక్షన్లు పడిపోయాయి. టాలీవుడ్ లో ఈ మూవీకి ఆదరణ లేకపోయింది.
కానీ కోలీవుడ్ లో మాత్రం ఇది హిట్. థియేటర్లకు జనం వస్తున్నారు, కలెక్షన్లు బాగున్నాయి. దీంతో తమిళ, తెలుగు ప్రేక్షకుల అభిరుచుల్లో స్పష్టమైన తేడా ఉందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

One thought on “తమిళంలో హిట్, తెలుగులో ప్లాప్! కారణం ఏమిటి?”
Comments are closed.