వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సంతకం చేశారు. ఓ కేసులో కోర్టు విధించిన ముందస్తు బెయిల్ షరతుల మేరకు ఆయన పోలీసు స్టేషన్‌కు హాజరై ఈ ప్రక్రియను పూర్తిచేశారు. సాధారణ ఎన్నికల తర్వాత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, ఇటీవల మళ్లీ గుడివాడలో కనిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై గతంలో దాడి జరిగిన ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ఆయన హైకోర్టును ఆశ్రయించగా, అక్కడి న్యాయస్థానం కింది కోర్టులో బెయిల్ కోరాలని సూచించింది. దాంతో, నాని గుడివాడ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత, కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతులలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు నేడు కొడాలి నాని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకం చేశారు.
ఇదిలా ఉండగా, గతంలో కొడాలి నాని అరెస్ట్ అయ్యారన్న వార్తలు వచ్చినా, పోలీస్ అధికారులు వాటిని వెంటనే ఖండించారు. ప్రస్తుతం ఆయన కోర్టు సూచించిన షరతుల్ని విధిగా పాటిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Read More : ఇంటర్‌లో ప్రతి విద్యార్థి చేరిక తప్పనిసరి – Minister

3 thoughts on “గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హాజరైన కొడాలి నాని”
Comments are closed.