వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కోటలపై బీజేపీ జెండా ఎగురబోతోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని చెప్పారు. ఈసారి మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీనే సాధిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌ను దోచుకోవడం మజ్లిస్‌కు అలవాటుగా మారిందని విమర్శించిన ఆయన, ఇప్పటివరకు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారితో కలిసి మజ్లిస్ పని చేసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటాన్ని, మజ్లిస్‌కు మద్దతుగా దాని అభ్యర్థుల్ని ఏకగ్రీవంగా చేయించాలన్న కుట్రగా ఆయన అభివర్ణించారు.
మజ్లిస్ పార్టీ గతంలో ఎన్నోసార్లు మతకలహాలకు ప్రేరణగా మారిందని గుర్తు చేసిన కిషన్ రెడ్డి, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, మజ్లిస్‌కు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.
పార్టీలో అంతర్గత విభేదాలు సహజమని, వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్యే స్థానం కోసం బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును అధిష్ఠానం ఖరారు చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.
Read More : కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి వేగం తెచ్చేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ..

One thought on “హైదరాబాద్‌లో మజ్లిస్ కోటల పైన బీజేపీ జెండా ఎగరబోతోంది: కిషన్ రెడ్డి…”
Comments are closed.