ఖమ్మం జిల్లా రైతుల కన్నీటి గోదావరి

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ యొక్క ఆవేదన రాష్ట్రాన్ని కలచివేస్తోంది. అకల వర్షాలు, సాగు నీటి కష్టాలు, కరెంట్ కోతలతో కష్టపడుతూ, కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగిస్తున్న ఈ రైతు దంపతులు ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర పరిస్థితిలో ఉన్నారు.

అకాల వర్షాల కారణంగా కష్టపడి పండించిన ధాన్యమంతా తడిసి ముద్దయి దెబ్బతిన్నది. కాగా, 20 రోజులుగా పంటను కొనుగోలు కేంద్రానికి తరలించినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకు పంట కొనుగోలు చేయకపోవడం రైతు కుటుంబానికి విపత్తుగా మారింది.

ప్రభుత్వం ధాన్యం కొనకుండా, పరిహారం చెల్లించకపోవడంతో, ఈ రైతు కన్నీటిపర్యంతంగా విలపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యం లో, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు, “రైతుల కన్నీటి కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా పట్టించుకోవాలి. వారి జీవితాల్లో విపత్తు తెచ్చింది కాలం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం,” అని ట్విట్టర్‌లో తెలిపారు.

హరీష్ రావు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతూ, ప్రతి పంట గింజను కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read More : కంచ్ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే – సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్ అఫిడవిట్