రిష‌భ్ పంత్‌పై పీబీకేఎస్ కౌంట‌ర్..

ల‌క్నో వేదిక‌గా నిన్న జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)ను 172 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 16.2 ఓవర్ల‌లోనే ఛేదించి చిత్తుగా ఓడించింది. ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్ర‌న్‌సింగ్ రాణించ‌డంతో పాటు పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్‌ అయ్య‌ర్ కేవలం 30 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేసి జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. ఈ విజ‌యం పంజాబ్ కింగ్స్‌కు వ‌రుస‌గా రెండో విజ‌యంగా నిలిచింది, పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, ల‌క్నో జ‌ట్టు ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో రిష‌భ్ పంత్‌ను రూ. 27 కోట్లు చెల్లించి కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, పంత్ ఆ త‌గ్గ‌నంతగా రాణించ‌డం లేదు. మూడు మ్యాచుల్లో బ్యాటింగ్‌కు దిగిన పంత్ వరుసగా 0, 15, 2 స్కోర్లతో నిరాశ పరిచాడు. ఈ వ‌రుస వైఫల్యాల‌పై ల‌క్నో జట్టు అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంత్‌ను విమ‌ర్శిస్తున్నారు.

ఇంత‌లో, పంజాబ్ కింగ్స్ ల‌క్నో కెప్టెన్ రిష‌భ్ పంత్‌పై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్, ఎల్ఎస్‌జీపై నిన్న విజయం సాధించిన తర్వాత “మెగా వేలం టెన్ష‌న్ దానంత‌ట‌దే ముగిసింది” అంటూ ట్వీట్ చేసింది.

Read More : HCA vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌ను వేరే వేదికకు మార్చాలని సూటి హెచ్చరిక….