కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. గౌరీకుండ్ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, అక్కడి భక్తులను సమీప సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాత్ర మార్గాన్ని పూర్తిగా మూసివేసి, శిథిలాలను తొలగించే పనులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత, మార్గం సురక్షితమని నిర్ధారించిన తర్వాత యాత్రను పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Read More : వందే భారత్ రైళ్ల సగటు వేగం తగ్గుదలపై రాజ్యసభలో చర్చ

One thought on “కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Comments are closed.