పాశమైలారం పేలుడు బాధితులను పరామర్శించిన కవిత

పాశమైలారం పారిశ్రామికవాడలోని కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని కవిత గురువారం ఆసుపత్రిలో పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఆమె భరోసా ఇచ్చారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రమాదం బాధాకరమని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం‌ను కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం, ఆర్థిక సహాయం అందించాలని అధికారులను కోరారు.

ప్రమాదంపై పార్టీ తరఫున కూడా సహాయ చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడకూడదనే దృష్టితో పరిశ్రమల నిర్వహణపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Read More : సంగారెడ్డిలో ఫ్యాక్టరీ పేలుడు: నవదంపతుల దుర్మరణం