తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఆమె దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఆ 42% రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారా లేదా అనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని కవిత ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించి, బీసీలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని కవిత ప్రకటించారు. ఈ దీక్షకు బీఆర్ఎస్ శ్రేణులు, పలు బీసీ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
Read More : హైదరాబాద్‌లో ఎలీ లిల్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం
