నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘హిట్ ది థర్డ్ కేస్’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. హిట్ 2 తర్వాత భారీ గ్యాప్ ఉన్నా, థర్డ్ కేస్‌పై ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. సినిమాను చివరి దశకు తీసుకొచ్చినప్పటికీ, ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ‘హిట్ ది ఫోర్త్ కేస్’లో హీరో ఎవరు అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. క్లైమాక్స్‌లో సరికొత్త ట్విస్ట్‌తో నాలుగో కేస్‌ను పక్కాగా ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే హీరోగా ఎవరు కనిపించనున్నారనే అంశంపై రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. కోలీవుడ్ స్టార్ కార్తీ, మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఇద్దరి పేర్లూ వినిపిస్తున్నాయి. కొందరు, ‘హిట్ ది థర్డ్ కేస్’ క్లైమాక్స్‌లో నాని తరహాలో కార్తీ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. మరోవైపు, దుల్కర్ సల్మాన్ ఈ ఛాన్స్‌ను అందుకున్నాడనే వార్తలు కూడా ఉన్నాయి. ఇద్దరూ అద్భుతమైన నటులే కావడంతో, ‘హిట్ ది ఫోర్త్ కేస్’లో పోలీస్ పాత్ర ఎవరు పోషిస్తారో అన్న విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.
కార్తీ ఇప్పటికే యాక్షన్ థ్రిల్లర్‌లకు ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ‘కాఖీ’, ‘సర్దార్’ వంటి చిత్రాల్లో అతని నటన గుర్తుండిపోతుంది. ఇక దుల్కర్ సల్మాన్ తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటాడు. హిట్ సిరీస్‌కు వీరిలో ఎవరు సరిపోతారో వేచిచూడాల్సిందే. ‘హిట్ ది ఫోర్త్ కేస్’లో ఎవరు పోలీస్ అవుతారనే సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేమికులను ఉత్కంఠకు గురిచేస్తోంది.

One thought on “హిట్ ది ఫోర్త్ కేస్’: కార్తీ లేదా దుల్కర్ – ఎవరు లీడ్ లో?”
Comments are closed.