టీసీఎస్ ఉద్యోగం వదిలేసి టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన పూజిత పొన్నాడ!

Poojitha Ponnada Tollywood Journey

తెలుగమ్మాయి పూజిత పొన్నాడ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి. సినీరంగంలోకి అడుగుపెట్టకముందు ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసింది. కానీ నటనపై ఉన్న ఆసక్తితో లక్షల జీతం వదులుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

2016లో నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన “ఊపిరి” సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించిన పూజిత, ఆ సినిమాలో చిన్న పాత్రలో మెప్పించింది.

ఆ తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన “ప్రేమమ్” సినిమాలో కాలేజీ విద్యార్థినిగా కనిపించినా, పెద్దగా గుర్తింపు రాలేదు. అయినప్పటికీ టాలీవుడ్‌లో వరుస అవకాశాలు పొందుతూ కెరీర్‌ను ముందుకు నడిపింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సమంతలతో కలిసి నటించిన “రంగస్థలం” సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో ఆది ప్రేయసిగా కనిపించిన పూజిత, ఈ పాత్రతో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం పూజిత పొన్నాడ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. గ్లామర్ ఫోటోలతో తరచుగా నెటిజన్లను ఆకట్టుకుంటూ, విపరీతమైన క్రేజ్‌ను సంపాదిస్తోంది. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీసీఎస్ ఉద్యోగం వదిలేసి నటనలో రాణించిన పూజిత, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Read More