కర్ణాటక హైకోర్టు ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీ సేవలను నిషేధించింది. రాబోయే ఆరు వారాల్లో ఈ కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. బైక్ ట్యాక్సీ సేవలను మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 కింద చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇచ్చింది.

బైక్ ట్యాక్సీ సేవలపై హైకోర్టు విమర్శలు
హైకోర్టు రైడ్ హెయిలింగ్ సేవల ఆపరేటర్లు మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బైక్ ట్యాక్సీ డ్రైవర్లు కొందరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారంటూ పలు ఫిర్యాదులు నమోదైనట్లు వెల్లడించింది.
నిబంధనల అమలుపై హైకోర్టు స్పష్టత
మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 93 ప్రకారం, కొత్త నిబంధనలు రూపొందించేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అప్పుడు వరకు ఉబర్, ర్యాపిడో, ఓలా బైక్ సర్వీసులకు అనుమతి లేదని పేర్కొంది. వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ద్విచక్ర వాహనాలను కమర్షియల్ వినియోగానికి అనుమతించబోమని తేల్చి చెప్పింది.
చట్టబద్ధత లేకుండా సేవలకు అనుమతి లేదు
బైక్ ట్యాక్సీలు చట్ట విరుద్ధమని, వీటికి సరైన చట్టబద్ధత అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా గుర్తించడానికి అవసరమైన అనుమతులు ఇచ్చే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. దీనికి చట్టపరమైన మార్గదర్శకాలు అవసరమని కోర్టు పేర్కొంది.
Read More : INS Tarkash భారీ ఆపరేషన్: సముద్రంలో 2500 కేజీల మాదకద్రవ్యాలు స్వాధీనం!

One thought on “కర్ణాటక హైకోర్టు బైక్ ట్యాక్సీ సేవలకు నిషేధం”
Comments are closed.