కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన “మ్యాడ్ స్క్వేర్” చిత్రం మార్చి 28న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మాణంలో విడుదలైంది. కామెడీ ప్రధానాంశంగా సాగే ఈ సినిమా, కథలో లోపాలున్నప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా వీకెండ్ కలెక్షన్లు విశేషంగా రాబట్టింది. కానీ, వారాంతం ముగిసిన తర్వాత కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ సినిమా విజయవంతం అయినా, మీడియా కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తోందని నిర్మాత నాగ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల్లో మాత్రం మంచి పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ, మొదటి వారంలో భారీ వసూళ్లు రాబట్టిన సినిమా, వారాంతం తర్వాత తగ్గుముఖం పట్టింది. “ఓటీటీలో చూసేద్దాం” అనే మైండ్‌సెట్ కారణంగా థియేటర్ ఆడియన్స్ తగ్గిపోయారు. గతంలో సినిమా సిల్వర్ జూబిలీ వరకు ఆడే రోజులు గడిచిపోయాయి. ప్రస్తుతం మేకర్స్, తొలి వారంలోనే భారీ కలెక్షన్లు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వీకెండ్ లో పెద్ద సినిమాలు వందల కోట్ల బడ్జెట్‌తో రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, వర్క్‌డేస్‌లో అదే జోష్ కొనసాగించడం చాలా కష్టమైన పరిస్థితిగా మారింది. “మ్యాడ్ స్క్వేర్” బాయ్స్ మంచి వినోదం అందించినప్పటికీ, వారాంతం తర్వాత కాస్త డల్ అయ్యింది. టాలీవుడ్ లో వీకెండ్ కలెక్షన్ల ఆధారంగా సినిమాల హిట్-ఫ్లాప్ నిర్ణయించే పరిస్థితి స్పష్టమవుతోంది.
