బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు టాలెంటెడ్ హీరో ఆర్. మాధవన్ మరోసారి జోడిగా నటించిన సినిమా షూటింగ్ పూర్తయింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ విషయాన్ని కంగనా స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా చిత్రబృందంతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, త్వరలోనే టైటిల్ను ప్రకటించనున్నట్లు తెలిపారు. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇది ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ తర్వాత కంగనా – మాధవన్ జోడిగా కలిసి నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే, ‘తలైవి’ తర్వాత కంగనా రనౌత్ మరోసారి ఏఎల్ విజయ్ దర్శకత్వంలో నటించడం విశేషం. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా టైటిల్, విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించనున్నారు.

One thought on “కంగనా రనౌత్, మాధవన్ జోడీ మరోసారి.. కొత్త సినిమా షూటింగ్ పూర్తి!”
Comments are closed.