ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా తన సబ్స్క్రైబర్స్ కోసం మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. వైవిధ్యమైన కథాంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ అందించే ఆహా, ఈసారి ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ను స్ట్రీమింగ్ చేయనుంది. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ టీజర్ తాజాగా విడుదలైంది.
2000వ సంవత్సరంలో ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రాకముందు ఓ అందమైన గ్రామం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. స్కూల్ లైఫ్, విద్యార్థుల సరదా పనులు, అప్పుడే మొదలయ్యే ప్రేమలు, కుటుంబ సంబంధాలు – ఈ వెబ్ సిరీస్ నేటి ప్రేక్షకులను నాస్టాల్జిక్ ఫీలింగ్ లోకి తీసుకెళ్తుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది.
ఈ వెబ్ సిరీస్లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం ఈ ప్రాజెక్టును నిర్మించారు. దేవ్ దీప్ గాంధీ కుండు సినిమాటోగ్రఫీ అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.
ఏప్రిల్ 4 నుంచి ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కుటుంబ సమేతంగా వీక్షించదగ్గ కంటెంట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు.

One thought on “ఆహాలో నూతన వెబ్ సిరీస్ ‘హోం టౌన్’ – టీజర్ విడుదల!”
Comments are closed.