కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని భూముల పరిరక్షణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. సుమారు 400 ఎకరాల భూములపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, హెచ్సీయూ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించబడింది.
సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్ దాఖలైంది. వన ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా ఈ భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని న్యాయవాది కోర్టును కోరారు. రేపు ఈ పిటిషన్పై విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
Read More : హెచ్సీయూ భూముల వ్యవహారం: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ముమ్మర స్పందన..

One thought on “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంచ గచ్చిబౌలి భూములపై మంత్రులతో చర్చ..”
Comments are closed.