మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశంలో ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు పిటిషన్లను కలిపి చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు.
పిటిషనర్ల తరఫు వాదనలో కమిషన్ నివేదికను రద్దు చేయాలని, అలాగే గత ఏడాది జారీ చేసిన జీఓను కొట్టివేయాలని కోరారు. నివేదిక కాపీని తమకు ఇవ్వకుండా నేరుగా మీడియాకు అందజేయడం దురుద్దేశపూర్వకమని సుందరం వాదించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని, 8బీ, 8సీ నిబంధనలను పాటించలేదని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్‌ను నియమించిందని, నివేదికలో వాస్తవ ఆధారాలు లేవని సుందరం తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్ కుంగిపోవడం వర్షాకాలం కారణంగానే జరిగిందని, దీనికి డిజైన్ లేదా ఇంజనీరింగ్ లోపం కారణం కాదని వాదించారు.
ఇక అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తరఫున వాదిస్తూ, కమిషన్ నివేదికను ఇంకా పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని, అసెంబ్లీలో చర్చించిన తరువాతే ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే నివేదికను అసెంబ్లీలో చర్చకు పెడతామని తెలిపారు.
అయితే హైకోర్టు, “అసెంబ్లీలో పెట్టకముందే నివేదికను మీడియాకు ఎందుకు ఇచ్చారు?” అంటూ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. నివేదిక కాపీలు న్యాయస్థానానికి సరిగా అందించాలంటూ సూచించింది.
మొత్తం వివరణలు విన్న తర్వాత, ఈ కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
Read More : కవిత బీఆర్‌ఎస్ పార్టీ కుట్రలను విమర్శించారు.

One thought on “కాళేశ్వరం నివేదికపై కేసీఆర్-హరీష్‌రావు పిటిషన్ల విచారణ వాయిదా”
Comments are closed.