కోలీవుడ్ హీరో సూర్యతో పెళ్లి అయిన తర్వాత, జ్యోతిక కొంతకాలం సినిమాల నుంచి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో ఆమెను తిరిగి సినిమాల్లోకి రావడానికి సూర్య మరియు అతని కుటుంబం అంగీకరించలేదని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు జ్యోతిక సూటిగా సమాధానం ఇచ్చింది.
సైదాన్ సినిమాతో బాలీవుడ్‌లో మంచి హిట్ సాధించిన జ్యోతిక, డబ్బా కార్టెల్ సిరీస్ తో తిరిగి మెప్పించింది. 46 ఏళ్ల వయసులో కూడా ఆమె మంచి అవకాశాలను పొందుతోంది.
జ్యోతిక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, పెళ్లయ్యాక తాను సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నప్పుడు సినిమాల్లోకి మళ్లీ ఎప్పుడొస్తావని సూర్యనే తనను రెగ్యులర్ గా అడుగుతూ ఉండేవాడని తెలిపింది. “నిజానికి, సూర్య మరియు అతని కుటుంబం నాకు సినిమాలలో తిరిగి నటించాలని ఎప్పుడూ ప్రోత్సహించారు,” అని జ్యోతిక చెప్పింది.
అలాగే, తన పాత సినిమాలు టీవీలో వచ్చినప్పుడు , సూర్యకు అభిమానుల నుంచి వచ్చిన మెసేజ్‌లను తనకి ఫార్వర్డ్ చేసేవాడు అని జ్యోతిక వెల్లడించింది. “ఆ మెసేజ్‌లలో, ఎందుకు ఆమెను సినిమాల్లో నటించనీయడం లేదని సూర్యను ప్రశ్నిస్తూ ఉంటారు,” అని జ్యోతిక తెలిపారు.
ప్రస్తుతం డబ్బా కార్టెల్ సిరీస్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న జ్యోతిక, త్వరలోసైతాన్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందించే వెబ్ సిరీస్‌లో కూడా నటించబోతుంది.
జ్యోతిక తన రెండో ఇన్నింగ్స్‌లో మరింత బిజీగా, విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగిస్తుండగా, ఈ సమయంలో ఆమె బాలీవుడ్ పై మరింత దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

One thought on “సూర్య, కుటుంబం నుంచి ఆంక్షలు లేవు-క్లారిటీ ఇచ్చిన జ్యోతిక!”
Comments are closed.