జనగామలో దారుణం: తల్లి, కుమార్తె దారుణ హత్య

జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జఫర్‌గఢ్‌ మండలం తుమ్మడపల్లి గ్రామంలో నిద్రిస్తున్న తల్లి (75), కుమార్తె (45) దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆస్తి తగాదాలే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర భయాందోళనను రేకెత్తించింది.

Read More : హిమాయత్‌ సాగర్‌కు కొనసాగుతున్న వరద

One thought on “జనగామలో దారుణం: తల్లి, కుమార్తె దారుణ హత్య

Comments are closed.