జైలర్-2లో బాలయ్య వర్సెస్ సూర్య: మాస్ యాక్షన్ కి రెడీ అవుతున్న రజనీకాంత్!

Jailer 2 Balakrishna vs Suriya

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జైలర్-2” సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ సినిమాపై మొదటి భాగం భారీ విజయంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్లు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన “జైలర్” తొలి భాగం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే “జైలర్-2″లో ఇంకా ఎక్కువమైన స్టార్ క్యాస్ట్ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ పవర్‌ఫుల్ పాత్రలో “జైలర్-2″లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్లు ఆయన పాత్ర పూర్తిగా విజృంభించనున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో, మోహన్‌లాల్, శివన్న పాత్రలు సీక్వెల్‌లో కొనసాగుతాయని తెలుస్తోంది. ఇక కోలీవుడ్ నటుడు సూర్య కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నెల్సన్ దిలీప్ కుమార్, సూర్యతో చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని ప్రచారం జరుగుతోంది.

సూర్య “జైలర్-2″లో విలన్ పాత్రలో నటిస్తే, బాలయ్యతో సూట్ అయ్యే విధంగా పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం, భారీ యాక్షన్ సీన్లు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూర్య, బాలయ్య మధ్య తగాదా సీన్లలో రజనీకాంత్ స్టైల్ టచ్ ఉంటే, సినిమా మాస్ ఎలిమెంట్స్‌తో నెక్స్ట్ లెవెల్‌లో ఉండనుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. బాలయ్యకు కోలీవుడ్‌లో కూడా మాస్ ఫీల్ కలిగించేలా దర్శకుడు నెల్సన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

Read More

One thought on “జైలర్-2లో బాలయ్య వర్సెస్ సూర్య: మాస్ యాక్షన్ కి రెడీ అవుతున్న రజనీకాంత్!

Comments are closed.