మరోసారి గొప్ప మనసు చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన బాలిక సుష్మకు ఆయన ఆర్థిక సహాయం అందించారు.

సుష్మ చికిత్స కోసం జగ్గారెడ్డి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని హామీ ఇచ్చారు.

ఇక, ఈ బాధాకర పరిస్థితిలో ఎవరికైనా సహాయం చేయాలనే సంకల్పం ఉంటే బాలిక తండ్రి మహేష్‌ను (9553461480) సంప్రదించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read More : ప్రియుడితో కలిసి భార్య చేతిలో భర్త హత్య.

One thought on “మరోసారి గొప్ప మనసు చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Comments are closed.