జాక్విలిన్, ఎలోన్ మస్క్ తల్లి కలిసి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు!

Jacqueline Fernandez spiritual visit with Maye Musk to Sidhivinayak Temple

ప్రభాస్ సాహో సినిమాలో “బ్యాడ్ గర్ల్” పాటతో గ్లామర్ డాల్‌గా కనిపించిన జాక్విలిన్‌కు సౌత్‌లో కూడా మంచి ఫాలోయింగ్ పెరిగింది. అయితే, బాలీవుడ్‌లోనూ, సౌత్‌లోనూ ఆశించిన స్థాయిలో కెరీర్ ముందుకుపోలేకపోయింది. సుకేష్ చంద్రశేఖర్ కుంభకోణ కేసుతో పేరుతో వార్తల్లోకి వచ్చేసిన జాక్విలిన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.

తాజాగా జాక్విలిన్ ఈస్టర్ సందర్భంగా ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేకత ఏమిటంటే, ఈసారి టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్ తల్లి మాయే మస్క్ కూడా ఆమెతో ఉన్నారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో ఇద్దరూ పూజలు చేసుకుంటూ కనిపించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

జాక్విలిన్ సంప్రదాయ శారీ ధరించగా, మాయే మస్క్ వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించారు. మాయే మస్క్ తన 77వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో ఆశీర్వాదం తీసుకున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆమె తన పుస్తకం “ఏ ఉమెన్ మేక్స్ ఏ ప్లాన్” హిందీ ఎడిషన్‌ను విడుదల చేయబోతున్నారు.

ఇక కెరీర్ పరంగా చూస్తే, జాక్విలిన్ ఇటీవల సోనూసూద్‌తో కలిసి “ఫతే” అనే యాక్షన్ మూవీలో నటించారు. అలాగే అజయ్ దేవ్‌గన్ “రైడ్ 2″లో ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ఇంకా “వెల్‌కమ్ టు ది జంగిల్,” “హౌస్‌ఫుల్ 5” వంటి చిత్రాల్లో భాగమై నటిస్తుండగా, అవి విడుదలలో ఆలస్యం జరుగుతోంది.

Read More


One thought on “జాక్విలిన్, ఎలోన్ మస్క్ తల్లి కలిసి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు!

Comments are closed.