జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఈడీ ఛార్జిషీట్‌ను రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమె క్రిమినల్ విచారణను తప్పనిసరిగా ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ వాదనలను హైకోర్టులో బలంగా వినిపించింది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఈ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని, నేరం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిందని ఈడీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాక, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఇప్పటివరకు సవాలు చేయనందున, జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ల భార్యల నుంచి రూ. 200 కోట్లు మోసపూరితంగా వసూలు చేశాడన్నది ప్రధాన ఆరోపణ. అతను ఈ మొత్తాన్ని హవాలా మార్గాల్లో తరలించి, బోగస్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాడని ఈడీ ఆరోపిస్తోంది. సుకేశ్‌తో పాటు అతని భార్య లీనా పౌలోస్‌, నటుడు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

Read More : హరిహర వీరమల్లు ట్రైలర్‌పై రామ్‌చరణ్ ప్రశంసలు

One thought on “జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

Comments are closed.