20 రోజుల్లోనే ఓటీటీలోకి ‘జాక్’ – స్టార్ బాయ్‌కు షాక్!

Jack movie OTT release

తెలంగాణ యాస, పాతబస్తీ నేపథ్యంలో తెరకెక్కిన ‘డీజే టిల్లు’ సినిమాతో యువహీరో సిద్దూ జొన్నలగడ్డ ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. స్వల్ప బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఈ సక్సెస్‌తో హైపై ఉన్న సిద్దూ, అదే క్యారెక్టర్‌ను కొనసాగిస్తూ ‘టిల్లు స్క్వేర్‌’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు.

‘టిల్లు స్క్వేర్‌’ ఓ మాదిరి స్పందన అందుకోగలిగినా, తక్కువ స్థాయిలోనే నిలిచింది. అదే ఫార్ములాతో సిద్దూ చేసిన తదుపరి సినిమా ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.9 కోట్లు మాత్రమే వసూలు చేసి నిర్మాతకు నష్టాలు మిగిల్చింది.

షూటింగ్ ఆలస్యం, పెరిగిన బడ్జెట్ నేపథ్యంలో ‘జాక్’ రిలీజ్ అనంతరం మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో బలహీనంగా నిలిచింది. విడుదలైన 20 రోజులు కూడా గడవకముందే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌లో వచ్చిన నష్టాలను ఓటీటీ ద్వారా మిగతా భాగం రికవరీ చేసేందుకు ఇది ఒక ప్రయత్నంగా చెప్పొచ్చు.

‘జాక్’ మూవీ మే 1 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో నిరాశ పరచిన ఈ సినిమా ఓటీటీలో ఎలా ప్రదర్శన ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read More

One thought on “20 రోజుల్లోనే ఓటీటీలోకి ‘జాక్’ – స్టార్ బాయ్‌కు షాక్!

Comments are closed.