బాలీవుడ్‌కు మాస్ హిట్ అందించిన “జాట్” సినిమాకు సీక్వెల్‌గా “జాట్ 2” రానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. సన్నీ డియోల్ మాస్ స్టైల్‌కు న్యాయం చేస్తూ, మరింత భారీగా ఈ సీక్వెల్ రూపొందనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ ప్రిపరేషన్ దశలో ఉందని సమాచారం.
మొదటి భాగం మాస్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్‌తో మంచి స్పందన పొందింది. బీ, సీ సెంటర్లలో బలమైన రెస్పాన్స్‌తో, బాక్సాఫీస్ వద్ద జాట్ విజయవంతంగా దూసుకుపోతోంది. పెద్దగా ప్రమోషన్ లేకపోయినా మౌత్‌టాక్ బలపడటం వల్ల 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది.
ఈ విజయం దృష్ట్యా మేకర్స్ వెంటనే సీక్వెల్‌ను అనౌన్స్ చేయడం స్ట్రాటజిక్ నిర్ణయంగా కనిపిస్తోంది. జాట్ 2లో మరింత స్టైల్, మాస్ యాక్షన్, కమర్షియల్ హైప్ పెంచేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా సన్నీ డియోల్ మరోసారి ఫుల్ యాక్షన్ మోడ్‌లో అలరించనున్నారని చెబుతున్నారు.

ఇక మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్‌లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, దర్శకుడు గోపీచంద్ మలినేని తెలుగు సినిమాలపైనా ఫోకస్ పెట్టనున్నాడు. ఇప్పటికే ఆయన బాలకృష్ణతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక “జాట్ 2” షూటింగ్ ఎప్పుడే ప్రారంభమవుతుందో సినీప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
