పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతిభకు కేరళ నుంచి గౌరవం

Prithviraj Sukumaran awards

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల ఎంపికలో ప్రత్యేకతను చూపిస్తూ, హీరోగా, నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన “ఎల్2 ఎంపురాన్” సినిమాకు మంచి స్పందన లభించింది. అంతకు ముందు వచ్చిన “ఆడు జీవితం” సినిమాతో కూడా పృథ్వీరాజ్ తన నటనా నైపుణ్యాన్ని మెరిపించారు.

బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆడు జీవితం” చిత్రం సౌదీలో కూలీల కష్టాల నేపథ్యంలో రూపొందింది. పృథ్వీరాజ్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 మార్చి 28న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళంలో టాప్ వసూళ్లు చేసిన చిత్రాల్లో నిలిచింది.

“ఆడు జీవితం” కోసం పృథ్వీరాజ్ ఎంతగానో కష్టపడ్డాడు. అతడి కృషి ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ కృషిని కేరళ ప్రభుత్వం గుర్తించి, రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమాకు ఏకంగా 9 అవార్డులు అందించింది. ఉత్తమ నటుడు పృథ్వీరాజ్, ఉత్తమ నటి ఊర్వశి, ఉత్తమ దర్శకుడు బ్లెస్సీతో పాటు మరికొన్ని కీలక విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు సొంతం చేసుకుంది.

మొత్తానికి “ఆడు జీవితం” చిత్రబృందం కృషికి మంచి ఫలితం లభించింది. నెటిజన్లు చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నారు. పృథ్వీరాజ్ సినీ ప్రయాణంలో ఇది మరో మైలురాయి అయింది.

Read More


One thought on “పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతిభకు కేరళ నుంచి గౌరవం

Comments are closed.