భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నావిక్-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. సుమారు 2,500 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇది నావిగేషన్ ఉపగ్రహాల సిరీస్లో తొమ్మిదవ ఉపగ్రహం కాగా, నావిక్ సిరీస్‌లో రెండోది. జీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది 17వ ప్రయోగం, పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన క్రయోజనిక్ దశతో 11వ ప్రయోగం. శ్రీహరికోట రాకెట్ కేంద్రం ప్రారంభమైన తర్వాత ఇది 100వ ప్రయోగం కావడం విశేషం.
ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు.
