ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్‌కు సహకరించారన్న ఆరోపణలపై ఇరాన్లో ముగ్గురు వ్యక్తులకు బుధవారం మరణశిక్ష అమలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశ భద్రతకు వ్యతిరేకంగా పని చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారిని ఉరిశిక్షకు గురి చేసినట్లు ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది.
ఈ కేసులో మొత్తం 700 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అనుబంధ నూర్‌న్యూస్ వెల్లడించింది. గూఢచార కార్యకలాపాల్లో పాల్గొన్నారన్న అనుమానంతో వీరిపై విచారణ జరిపిన అనంతరం ముగ్గురిపై ఉరి శిక్ష అమలు చేశారు.గమనించాల్సిన విషయం ఏంటంటే.. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ ఉరిశిక్షలు అమలయ్యాయి. 12 రోజులపాటు ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చిన అనంతరం, శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన 24 గంటలకే ఇలా ఉరిశిక్షలు అమలు కావడం అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇరాన్ ఈ చర్యలతో యూదు దేశంతో సంబంధాలున్నారని అనుమానించిన వందల మందిని అరెస్టు చేయడమే కాకుండా, గూఢచర్యంపై కఠినంగా వ్యవహరిస్తున్నదని స్పష్టమవుతోంది. శాంతి ఒప్పందం ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More : ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తారాస్థాయికి..

One thought on “మొసాద్‌కు గూఢచర్యం కేసులో ముగ్గురికి ఇరాన్లో ఉరిశిక్ష”
Comments are closed.