ఇండియన్ నేవీకి కొత్త శక్తి

భారత నౌకాదళం శక్తి ప్రదర్శనలో మరో కీలక ఘట్టం నెలకొంది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిసైల్ డిస్ట్రాయర్ INS సూరత్ సముద్ర తీరానికి సమీపంగా ఉన్న లక్ష్యాన్ని అత్యంత సమర్ధవంతంగా ఛేదించగలిగింది. సహకార పద్ధతిలో చేపట్టిన ఈ పరీక్ష విజయవంతం కావడంతో భారత రక్షణ శక్తికి మరింత బలం చేకూరినట్లయ్యింది.

ఈ విజయంతో భారత నౌకాదళం సామర్థ్యం మరింత పెరిగిందని, సముద్ర తీరాల రక్షణలో కీలకమైన ముందడుగు పడిందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. INS సూరత్‌కు ఈ పరీక్ష విజయంతో “ఫ్రంట్‌లైన్ డిఫెన్స్ అస్త్రం”గా గుర్తింపు లభించింది. దేశ రక్షణ అవసరాలను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చగలదని ఈ విజయంతో మరోసారి నిరూపితమైంది.

INS సూరత్ విజయవంతమైన ఈ ప్రయోగం భారతదేశ రక్షణ వ్యూహంలో మరో మైలురాయిగా నిలిచింది.

Read More : ఉగ్రవాద దాడికి బలైన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్..