కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఇద్దరూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా, ప్రస్తుతం అవి హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి.
కమిషన్‌కు విచారణాధికారం లేదని, తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకపోవడంతో నివేదికను కొట్టివేయాలని పిటిషన్లలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ఈ నివేదిక వేదికవుతుందంటూ ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టుగానే కమిషన్ నివేదిక రూపొందించిందని విమర్శించారు.
ఇక జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కమిషన్ విచారణలోని అన్ని అంశాలను విశ్లేషణాత్మకంగా వివరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలో ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Read More : ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల అవకతవకలు.
