భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో, కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కొనసాగింపుపై ఈ మధ్యాహ్నం జరగాల్సిన భారత్-పాకిస్థాన్ డీజీఎంఓల హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. వాయిదాకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. ఈ చర్చలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ ఎలాంటి షరతులకు లొంగదని పేర్కొంది, అయితే పాకిస్థాన్ స్పందన ఎలా ఉంటుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో ప్రధాని నివాసంలో మరో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలపై వీరు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
Read More : మళ్లీ ప్రారంభమైన విమాన సేవలు
2 thoughts on “DGMOs హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి వాయిదా.”
Comments are closed.